చక్కటి నిద్రకి చంద్రబాబు చిట్కా

 

రాత్రుళ్ళు నిద్ర పట్టక అల్లాడిపోయేవాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే చిట్కాని పాటించండి... హాయిగా నిద్రపడుతుంది. ఎంత నిద్రపడుతుందీ అంటే.. మూడుసార్లు లేపినా లేవనంత నిద్ర పడుతుంది. చక్కగా నిద్రపోవడానికి చంద్రబాబు చెప్పిన ఆ చిట్కా ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ‘‘కష్టపడి పనిచేస్తే మెదడు పదునుతేలి వేగంగా పనిచేస్తుంది. దీనికి నేనే ఒక ఉదాహరణ. నేను పరుగులు తీస్తూ పనిచేస్తున్నాను. రాత్రివేళ ఆరుగంటలపాటు హాయిగా నిద్రపోతున్నాను. మూడుసార్లు లేపితే తప్ప మెలకువ రానంత గాఢనిద్రపోతున్నాను. అందువల్ల అందరూ కష్టపడి పనిచేయండి. ఆరోగ్యంగా వుండటంతో పాటు మెదడు చురుగ్గా వుంటుంది. నిద్రకూడా హాయిగా పడుతుంది’’

Online Jyotish
Tone Academy
KidsOne Telugu