TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాపు రిజర్వేషన్..చంద్రబాబు వ్యూహమేంటి?

Published on: Mon Jul 30, 2018 3:04PM

కాపుల రిజర్వేషన్ కోసం రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందరికి విదితమే.అయితే అంతా సర్దుమణిగింది అనుకున్న రగడ జగన్ వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకొచ్చింది.జగ్గంపేటలో పాదయాత్రలో ఉన్న జగన్ అక్కడ ఏర్పాటు చేసిన భహిరంగ సభలో కాపుల రిజ‌ర్వేష‌న్ రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప‌రిధిలో లేని అంశ‌మ‌ని,రాష్ట్ర‌పరిధిలోని లేని అంశం కాబ‌ట్టి తానేం చేయ‌లేక‌పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.దీనిపై పలువురు నేతలు జగన్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు.

 

 

చాలా కాలంగా రిజ‌ర్వేష‌న్ అంశంపై ఎక్క‌డా మాట్లాడ‌ని చంద్ర‌బాబు రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంపిల ద్వారా వ్యూహాన్ని అమ‌లులోకి తేవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది.ఈ రోజు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద 9 నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. కాపు రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు.కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయాలన్నారు.చూద్దాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో?. అలాగే విభజన చట్టం,అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలుపై పట్టుబట్టాలని తెలిపారు. పార్లమెంటులో హామీలు ఇచ్చారని...ఇప్పుడు చేయలేమని అఫిడవిట్లు వేస్తున్నారని మండిపడ్డారు.కడప ఉక్కు తరహాలోనే రైల్వేజోన్‌పై పోరాటం తీవ్రం చేయాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు.