చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలుస్తాట్ట...
Published on: Wed Nov 11, 2015 6:46PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ నాయకుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటున్నారని, దీనికోసం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారని సమాచారం. గురువారం మధ్యాహ్నం ఆయన చంద్రబాబును కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అమరావతి నిర్మాణం, కేంద్రం నుంచి అందుతున్న సహాయ సహకారాలు, రాజధాని రైతులు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం వుందట.


