TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ ఏ.పి భవన్ లో ఉద్రిక్తత

Published on: Wed Oct 9, 2013 10:18AM

 

ఆంద్ర రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయమని కోరుతూ ఢిల్లీ లోని ఏ.పి భవన్ లో చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యం లో ఏ.పి భవన్ లో దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు అక్కడి నుండి వైదొలగాలంటూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతు తెలుపుతూ వందలాదిగా రాష్ట్రం నుండి కార్యకర్తలు ఢిల్లీ కి తరలి వెళ్తున్నారు. ఈ నేపధ్యం లో తెలుదేసం పార్టీ ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ.పి భవన్ ఉన్నది ఎవరికోసమని,దేశ రాజధానిలో న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక ప్రముఖ నేతకు ఇంతటి పరాభావమా అని,ఇది తెలుగువారి పట్ల కాంగ్రెస్ అధిష్టానం యొక్క నిర్లక్ష్య వైఖరి,తెలుగువారికి జరుగుతున్న అవమానం అని నామా వాపోయారు.