25 నుంచి తెలుగు వారి ఆత్మ గౌర‌వయాత్ర

 

రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అవ‌లంభిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త‌ల‌పెట్టిన తెలుగు వారి ఆత్మ గౌవ‌ర యాత్ర ఈ నెల 25 నుంచి మొద‌లు కానుంది. ఉత్తరాంద్ర టీడిపి నేత‌ల‌తో టెలికాన్ఫరెన్స్‌లో చ‌ర్చించిన చంద్రబాబు ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రోజులు పాటు ఏ ఏ మార్గాల్లో యాత్ర ఉంటుంది అన్న దానిపై త్వర‌లోనే స్పష్టత ఇవ్వనున్నారు.

విజయనగరం జిల్లా, కొత్తవలస నుంచే బస్సు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 25 న ఉద‌యం 8.30కు చంద్రబాబు హైద‌రాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ‌తారు. అక్కడి నుంచి జంగాల ప‌ల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన త‌రువాత విజ‌య‌న‌గ‌రం జిల్లా కొత్త వ‌ల‌స చేరుకొని అక్కడి నుంచి యాత్ర పారంభిస్తారు.

తొలి విడ‌తగా విజ‌య‌న‌గ‌రం, శ్రీ కాకులం జిల్లాలో 10 రోజుల పాటు యాత్ర నిర్వహించనున్నారు. గ‌తంలో బాబు పాదయాత్రలో ప‌ర్యటించ‌లేని ప్రాంతాలను ఇప్పుడు ఆత్మ గౌర‌వ యాత్రలో ప‌ర్యటించ‌నున్నారు. త‌రువాత రెండో విడ‌త యాత్ర ప్రకాశం జిల్లా నుంచి మొద‌లు పెట్టి నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో నిర్వహించ‌నున్నారు.