ఢిల్లీ వేదికగా బాబు నిరవదిక దీక్ష

 

సీమాంద్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేఖంగా యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతికేకంగా ప్రజలతో పాటు నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం వైఖరిపై మండిపడ్డారు.

 

సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రవిభజనపై ముందుకు వెళ్లకూడదని డిమాండ్‌ చేస్తూ సోమవారం నుండి డిల్లీలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు బాబు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, టిడిపి పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, వారి సమస్యల కోసం పోరాడుతుందని హామి ఇచ్చారు.

 

సీమాంద్రలో సమస్యలపై గతంలో రాష్ట్రపతిపి కలిసి చెప్పామని, ఇదే విషయాన్ని ప్రదానితో చెప్పాలని భావించినా.. ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలా ప్రతి విషయంలో సీమాంద్ర ప్రజల మనోభావాలను కించపరిచారన్న ఆయన విభజన విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు కనుకే దీక్షకు దిగుతున్నట్టుగా ప్రకటించారు.