జగన్ కార్యాలయంగా మారిన చంచల్‌గూడ జైలు?
Published on: Fri Aug 24, 2012 8:06AM
ఒక రిమాండు ఖైదీతో ప్రవర్తించినట్లు చంచల్‌గూడజైలు అధికారులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డితో ప్రవర్తించటం లేదు. నిబంధనల ప్రకారం అనుమతించాల్సిన ములాఖత్‌ల కన్నా అదనంగానే ఆయనకు జైలు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా విఐపి ఖైదీలందరి లోనూ జగన్‌ను ప్రభుత్వ అతిధిగా చూసుకుంటున్నారు. ఆయన కోరిన తిండి సదుపాయం కల్పిస్తున్నారు. అలానే జ్యూస్‌లూ అందిస్తున్నారు. కొత్తగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాలుమోపాలనుకునే వారికి చంచల్‌గూడాజైలులో ముందు వరసలో ములాఖత్ కల్పిస్తున్నారు. అసలు రోజుకు ఎన్ని ములాఖత్‌లు జరిగినా జైలు అధికారులు ఆయనను ఇష్టపడి మరీ అవకాశం కల్పిస్తున్నారు. ఎవరో అన్నట్లు సేవ చేయవచ్చు కానీ, బానిసచాకిరీలు ఎందుకు అని ఎవరన్నా కూడా జైలు అధికారులు స్పందించటం లేదట. ఇప్పటికే రోజూ ఈ జైలుకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోతోందని, ఒక్కోసారి ట్రాఫిక్ సమస్య కూడా ఎదుర్కొంటున్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ, జైలు అధికారులు మాత్రం ములాఖత్‌ల సంఖ్య పెంచటానికి వీలులేదన్న కోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్నారు. రోజూ జగన్‌ను కుటుంబసభ్యులు, అభిమానులు, కొత్తగా పార్టీలో చేరాలనుకున్న వారు కలుస్తున్నారు. చంచల్‌గూడ జైలు బయట నుంచి చూసేవారికి ఆ జైలు జగన్ కార్యాలయమా అనే అనుమానం వస్తోంది.


