పాపం వెంకయ్య నాయుడు

 

వెంకయ్య నాయుడు ఇప్పుడంటే ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి సైలెంట్ గా ఉన్నారు కాని, ఒకప్పుడు అలా కాదు.. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిరోజూ ప్రజలు ఆయన పేరు వింటూనే ఉంటారు.. ఆయనికి అప్పట్లోనే కేంద్రంలో మంచి పేరు ఉండేది.. తెలుగు ప్రజల కోసం ఆలోచించే ఆయన.. విభజన సమయంలో, ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని కోరారు.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పదేళ్ల  ప్రత్యేకహోదాకి ఒప్పుకుంది.. తర్వాత ఎన్నికలు రావడం, బీజేపీ అధికారంలోకి రావడం అలా జరిగిపోయాయి.. బీజేపీ కూడా ప్రత్యేకహోదా ఇస్తా అనడంతో.. తన రాష్ట్రానికి సొంత పార్టీ ప్రత్యేకహోదా ఇస్తుందంటూ వెంకయ్య నాయుడు తెగ సంబరపడిపోయారు.. కానీ బీజేపీ యూ టర్న్ తీస్కొని ప్రత్యేక ప్యాకేజీ అంది.. ప్రస్తుతానికి ప్యాకేజీనే మహా ప్రసాదం అనుకొని వెంకయ్య దానికి కూడా ఒప్పుకున్నారు.. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి.. ఏపీ ప్రజలు, ప్రభుత్వం ప్రత్యేకహోదా కావాల్సిందే అంటున్నారు.. ఇంత జరుగుతున్నా, ఒకప్పుడు రాష్ట్రానికి, కేంద్రానికి వారధిలా వ్యవహరించిన వెంకయ్య, ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారు.

దానికి కారణం ఆయన ఇప్పుడు ఉప రాష్ట్రపతి.. దక్షిణాది నుండి బీజేపీ లో యాక్టీవ్ గా ఉండే లీడర్స్ లో ముందుగా  వెంకయ్య పేరు చెప్పేవారు.. అలాంటి వెంకయ్యను మోడీ కావాలనే సైలెంట్ చేయడానికి ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చాడని ఆరోపణలు వినిపించాయి.. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోరిక బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు పేరు తెరమీదకి వచ్చింది.. ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, వెంకయ్య నాయుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

వెంకయ్య నాయుడు ప్రస్తుతం బంగారు పంజరంలో ఉన్న చిలుక అని, ఏపీ కి సాయం చేయలేక కన్నీరు పెట్టుకుంటున్నారని, ఈ పరిస్థితికి మోడీనే కారణమని చలసాని అన్నారు.. ఇదంతా చూసి.. పాపం ప్రాసలు, ప్రత్యక్ష రాజకీయాలు ఇష్టపడే వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అనే పంజరంలో బందీ అయి మౌనంగా ఉండిపోతున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.