TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అలా అయితే గుజరాత్‌లో దాక్కోవాల్సి వస్తుంది..

Published on: Fri Mar 2, 2018 12:18PM

 

ఏపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఇప్పటికే ఏపీ ప్రజలు చాలా కోపంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్య ఏపీని రెండు ముక్కలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితిమే. అయితే ఇప్పుడు దీనిపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని స్పందించి కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని... ఆ విధమైన విషప్రచారాలు చేస్తే తెలుగువారు కొట్టే దెబ్బలకు గుజరాత్‌లో దాక్కోవాల్సి వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశవ్యాప్తంగా తెలుగువారి జనాభా 13 కోట్ల దాకా ఉందని, వారంతా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని.. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కర్ణాట, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి జరిగిన అన్యాయంపై ప్రచారం చేస్తామని హెచ్చరించారు. తమ ప్రచారం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేలా చేస్తామని వారు హెచ్చరించారు.