TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చలమలశెట్టి సునీల్ కు దేశం ఆహ్వానం

Published on: Sat Mar 3, 2012 1:25PM

హైదరాబాద్: గత ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీ తరపున కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేసి ఓటమి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ ను తెలుగుదేశంపార్టీ ఆహ్వానిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తరువాత పిఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించాలనుకున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేత యనమల రామకృష్ణుడు చలమలిశెట్టి సునీల్ ను తెలుగుదేశంపార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. అనంతరం యనమలతో కలిసి సునీల్ దేశం నేత నారా చంద్రబాబు నాయుడును కూడా కలుసుకుని స్పష్టమైన హామీ పొందాక ఆపార్టీలో చేరడానికి అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన అట్టహాసంగా తెలుగుదేశంపార్టీల్లో చేరే అవకాశం ఉంది.