TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం

Published on: Wed May 7, 2025 8:50PM

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో అతుల్ జైన్‌తో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. నీటిపారుదల శాఖ అధికారుల బృందం కూడా ఈ సమావేశానికి హాజరైంది. నేషనల్ డ్యామ్ సంరక్షణ సంస్థ సమర్పించిన నివేదికలో మేడిగడ్డ డ్యామ్ డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లో భారీ లోపాలు ఉన్నాయని స్పష్టం చేయడంతో, దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు మేము పునరుద్ధరణ మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 

డీపీఆర్‌లో చూపిన ప్రదేశానికి భిన్నంగా వేరే ప్రాంతంలో నిర్మాణం జరగడం తగదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పలు ప్రతిపాదనలను ఆయన కేంద్రం ముందుంచారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. బ్యారేజీ మరమ్మతులు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలసంఘం ఛైర్మన్‌కు వివరించారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, డిజైన్‌లో స్పష్టమైన లోపాలున్నాయని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి విడతకు 45 టీఎంసీల నీటిని, అలాగే సమ్మక్క-సారక్క బ్యారేజీకి 44 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.