షాకిచ్చిన కేంద్రం.. ప్రత్యేక హోదా లేదు...!

 

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వడంతో మరోసారి టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి మద్దతు పలికారు. అయితే ఇన్ని ఆందోళనలు.. ఇంత పోరాటం చేస్తున్నా... కేంద్రం మాత్రం మరోసారి ఏపీకి షాకిచ్చింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం.. ఎన్ని ఉద్యమాలు చేసినా హోదా సాద్యం కాదంటూ తేల్చి చెప్పేశారు. గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని మొండిచెయ్యే చూపించింది.  అంతేకాదు... పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని... ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది.అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.