మెట్రో కథనాలపై స్పందించను: వెంకయ్య
Published on: Thu Sep 18, 2014 5:52PM
.jpg)
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారాలకు సంబంధించి మీడియాలో వచ్చిన విషయాలన్నిటి మీద తాను స్పందించనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మెట్రో రైలుకు సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే వాటిమీద తాను స్పందించనని ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే అధికారులు, నిర్మాణ సంస్థ, ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గడం సమంజసం కాదని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అన్నారు.


