సీఎంలతో కేంద్ర మంత్రి వెంకయ్య భేటీ!
Published on: Sat Aug 2, 2014 12:37PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు భేటీ అయ్యారు. ‘రాష్ట్రాల వద్దకే కేంద్రం’ పథకంలో భాగంగా ఆయన ముఖ్యమంత్రులను కలిశారు. కేసీఆర్‌తో జరిగిన భేటీలో కేసీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగణలోని ప్రాజెక్టులు, నిధుల మీద కేంద్రమంత్రి వెంకయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలివి....
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. అందులో భాగమే ఈ భేటీ.
2. రాజకీయ అనిశ్చితి వల్ల ఇంతకాలం సంయుక్తం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలూ వేగంగా అభివృద్ధి చెందాలి.
3. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అమలవుతున్న కేంద్ర పథకాల ప్రగతిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే నోట్ అందించాం.
4. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రెండు రాష్ట్రాలు కలసి పనిచేయాలి.


