TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

2019 అక్టోబర్ లోనే పోస్కోతో విశాఖ డీల్! అన్ని తెలిసినా స్పందించని జగన్ సర్కార్ 

Published on: Wed Feb 10, 2021 3:58PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు నిజం బయటపడింది. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల చీకటి బాగోతం వెలుగు చూసింది. రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి స్టీల్ ప్లాంట్ అంశంలో సంచలన విషయాలు బయటపెట్టారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు  ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ..  పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఒప్పందం తర్వాత సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిశారని చెప్పారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిందని  కూడా  కేంద్రమంత్రి రాజ్యసభలో తెలిపారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్నారు. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ను.. ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని సమాధానమిచ్చారు. 
        

పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్రం రహస్యంగా ఉంచడంపై పలువురు మండిపడుతున్నారు.2019 అక్టోబర్ లో డీల్ కుదిరిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా దాచి పెట్టారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారం ప్రైవేటీకరణ అవుతుందని తెలిసినా జగన్ సర్కార్ మౌనంగా ఉండటంపై విశాఖ వాసులు మండిపోడుతున్నారు. కేంద్రంతో కుమ్మక్కై జగన్ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్ని తెలుసు కాబట్టే.. ఆంధ్రా జనమంతా ఆందోళన చేస్తున్నా వైసీపీ నేతలు స్పందించడం లేదంటున్నారు.