వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా వ్యాక్సిన్.. తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి
Published on: Tue Oct 13, 2020 2:13PM

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఒక తీపి కబురు అందించారు. వచ్చే ఏడాది ఆరంభం లోనే కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలనే దానిపై నిపుణులు ప్రస్తుతం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన తయారీ కోసం ఇప్పటికే ప్రపంచంలోని పలు సంస్థలు తీవ్ర పరిశోధనలు చేస్తున్నాయి. కాగా కొన్ని సంస్థల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు కూడా చేరుకొన్నాయి. మరో పక్క భారత్ కు చెందిన భారత్ బయోటెక్, కాడిలా సంస్థలు కూడ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోదనలు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ కు చెందిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది .
ఇది ఇలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 72 లక్షలకు చేరుకొంది. గడచిన 24 గంటలలో 66,732 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా కరొనతో 816 మంది చనిపోవడంతో... దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,09,150కి చేరింది. దేశంలో గత 24 గంటల్లో 71559 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


