TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

Published on: Fri Feb 5, 2021 9:58AM

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గుడ్ న్యూల్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోలవరంపై పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు  అయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి? ఎంత భూసేకరణ చేశారు? కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చింది? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో  లిఖిత పూర్వక సమాధానం చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 10,848.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 1.11 లక్షల ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపింది. భూసేకరణ, పునరావాసం అంచనా రూ.28,172.21 కోట్లుగా పేర్కొంది.

పోలవరం ప్రాజెక్ట్స్ హెడ్ వర్క్స్ 69.68 శాతం పూర్తయ్యాయని కేంద్ర సర్కార్ తెలిపింది. ఎడమకాల్వ తవ్వకం 92 శాతం, లైనింగ్ పనులు 70శాతం పూర్తయినట్లు వెల్లడించింది. నిర్మాణ బాధ్యతలను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షిస్తోందని పేర్కొంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే ఖర్చును పూర్తిగా భరించనుందని స్పష్టం చేసింది. ఇక 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.