మరోసారి చిల్లర బుద్ది చూపించిన కేంద్రం...

 

ఏపీకి కేంద్రం మరో షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన చిల్లర బుద్దిని చూపించింది. ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు కేటాయించకపోగా.. ఇప్పుడు ఇచ్చిన నిధుల్లోనే మళ్లీ వెనక్కి తీసుకోవడం ఆ ప్రభుత్వానికి చెల్లింది. గతంలో వెనుక బడిన జిల్లాల నిధుల విషయంలో ఇలానే వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీపై తన చిన్న చూపు చూపింది. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం... వంద శాతం కాదు కదా.. కనీసం యాభై శాతం కూడా నిధులు ఇవ్వకుండా డ్రామాలాడుతుంది. అడగ్గ అడగ్గా.. ఎప్పుడో ఒకసారి... అరునెలలకో.. ఏడాదికో ఏదో నానా సాకులు చెబుతూ... ఏదో చిల్లర విధిల్చినట్టు నిధులు విడుదల చేస్తోంది. ఇప్పుడు ఆ నిధుల్లో కూడా వంకలు చూపించి.. ఇచ్చిన దాంట్లోనే కొంత భాగం వెనక్కితీసుకుంటున్నారు.  ఏపీ ప్రభుత్వం నెలల తరబడి ప్రయత్నాలు చేయగా.. కేంద్రం పధ్నాలుగు వందల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ నాబార్డుకు లేఖ రాసింది. అయితే కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలపై  వెంటనే రంగంలోకి దిగిన పీఎంవో పోలవరం కోసం విడుదల చేసిన మొత్తం నుంచి…కొంత తగ్గించాలని ఒత్తిడి చేసింది. దాంతో కేంద్ర జలవనరుల శాఖ… నాలుగొందలు కోట్ల రూపాయలను తగ్గిస్తూ … కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మరోసారి కేంద్రానికి ఏపీ విషయంలో చిన్నచూపు చూపు ఉందన్న విషయం అర్దమైంది...