జగన్ తాపత్రయం....ఎక్కడికక్కడ తొక్కిపెడుతోన్న కేంద్రం

 

ఏపీ నూతన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ పరిపాలనలో తనదైన ముద్ర వేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. పాలన మీద ద్రుష్టి పెట్టని ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎత్తి చూపాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే ఆయన ఎంతో కష్టపడినా ఆ అవినీతి మరకలు చూపెట్టలేకపొతున్నారు. ఇక పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ మీద ద్రుష్టి సారిస్తే ఎంతో కొంత అవినీతి బయటకి వస్తుందని ఆయన భావించారు. దానికి అనుగుణంగానే మొన్న పోలవరం పర్యటనకి వెళ్లి తనకు ఉన్న అనుమానాలు అన్నీ అక్కడి అధికారులని అడిగి నివృత్తి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనకి ఆ విషయంలో అవినీతి ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వకుండా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలను ఆమోదించి అందులో అవినీతి ఏమీ లేదని చెప్పినట్టయ్యింది. అయితే జగన్ అనుకున్నట్టు విద్యుత్‌ శాఖ మీద కూడా సమీక్షలు కుదరదని అంతా సవ్యంగానే ఉందని కేంద్ర విద్యుత్‌శాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. 

అదే చేత్తో గత ప్రభుత్వం పిపిఎలను కుదుర్చుకోవడంలో పారదర్శకంగా పనిచేసిందని సర్టిఫికేట్‌ ఇచ్చి జగన్‌ కి ఈ విషయాలన్నీ అర్ధం అయ్యేలాగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఇలా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో తప్పుపడుతూ వెళ్తోంది కేంద్రం. గత ప్రభుత్వం అవినీతిమయమని నిరూపించాలని తహతలాడుతోన్న జగన్‌ కు కేంద్రం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. దానికి కారణం లేక పోలేదు గత టీడీపీ ప్రభుత్వంతో బీజేపీ మంత్రులు దాదాపు మూడున్నరేళ్ళ పాటు కలిసి పని చేశారు. అప్పట్లో అవినీతి అని ముద్ర వేస్తే తమ మీద కూడా ముద్ర వేసుకున్నట్టే, అందుకే కేంద్రం ఎక్కడికక్కడ జగన్ ప్రయత్నాలను తోక్కిపేడుతోంది. 

ఇక మరోపక్క చంద్రబాబు కూడా ఒకప్పుడు బీజేపీతో సన్నిహితంగానే మెలిగి చివరికి ప్రత్యెక హోదా అనే అంశం విషయంలో కొర్రీ పెట్టుకుని బయటకు వెళ్ళాడు. అయితే జగన్ తో నేరుగా సంబంద బాంధవ్యాలు లేకున్నా కాస్తో కూస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. రేపు జగన్ కూడా చంద్రబాబు లానే అంతా కేంద్రం మీదకి తోసే ప్రయత్నం చేస్తే ? మళ్ళీ జనాల్లో తేలిక అవుతామని అసలు ప్రత్యేక హోదా కుదరదని చెబుతూ వస్తోందో. ఎటూ కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం జగన్ చేయడు, ఒకవేళ చేసినా పెద్దగా ఇబ్బంది పడకుండా బీజీపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం జగన్ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది.