ఏపీ ఫైల్.. కేంద్రం ఫైర్.!!

ఏపీ నుండి వచ్చే ఫైల్స్ మీద ఢిల్లీ అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారట.. ప్రత్యేక దృష్టి అంటే ఫైల్ లో ఉన్న పని త్వరగా పూర్తి చేయడం కాదు.. ఫైల్ లో తప్పులు ఏమన్నా ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చూస్తున్నారట.. ఎందుకు చూడరు? అసలే కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది.. మరి కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకు.. ఏపీ ప్రభుత్వం మీద, ఏపీ ఫైల్స్ మీద ఆ మాత్రం దృష్టి ఉంటుంది కదా.

 

 

అధికారులు ఏపీ ఫైల్ అని తెలిస్తే చాలు.. దానిని ఒకటికి రెండు సార్లు పరీక్షించి చూసి ఏ చిన్న తప్పు లేదని తెలిస్తేనే ముందుకి పంపుతున్నారట.. దీంతో పనులు త్వరగా పూర్తి అయ్యేందుకు వీలుగా ఏపీ ఉన్నతాధికారులే స్వయంగా ఫైల్స్ తీసుకొని ఢిల్లీ వెళ్తున్నారట.. మరోవైపు అధికారుల మధ్య ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుందట.. ఎన్డీయే నుండి ఏపీ ప్రభుత్వం బయటికి వచ్చి పోరాటం చేయడం వెనక గల కారణాలను ఢిల్లీ అధికారులు, ఏపీ అధికారులను అడిగిమరీ తెలుసుకుంటున్నారట.. ఇదంతా చూస్తుంటే మొత్తానికి కేంద్రం అన్ని విషయాల్లో ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టిందిగా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.