TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సామాన్యుడి నెత్తి మీద వంటగ్యాస్ పిడుగు

Published on: Thu Feb 4, 2021 4:23PM

కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను ప్ర‌తిరోజు పెంచుతుండడంతో ప్రజలు ఇప్పటీకే అల్లాడిపోతున్నారు. ఒక పక్క లీట‌రు పెట్రోల్ ధర 100రూపాయ‌ల వైపు ప‌రుగుపెడుతున్నా… కేంద్రం నుండి ఎటువంటి స్పంద‌న లేదు. పెరుగుతున్న డిజిలి ధరలతో దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తాజా బడ్జెట్ లో దీనిపై అగ్రి సెస్ అంటూ మ‌రింత వ‌డ్డించేందుకు సిద్ధం కాగా… అన్ని వైపుల నుండి తీవ్ర నిర‌స‌న రావడంతో కొద్దిగా వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోంది.

ఇది ఇలా ఉండగా సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు షాక్ ఇస్తూ.. కేంద్రం వంట‌గ్యాస్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. ఈ కొత్త ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.25, కమర్షియల్ సిలిండర్‌పై రూ.184 పెంచారు.దీంతో హైద‌రాబాద్ లో నిన్నటివరకు రూ 746 గా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ వంట‌గ్యాస్ ధ‌ర పెరిగిన రేటు ప్రకారం సిలిండ‌ర్ కు 771.25రూపాయ‌ల‌కు చేరుకుంది.