TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీకి ఇక ఇచ్చేదేమీ లేదని తేల్చేసిన కేంద్రం..!!

Published on: Wed Jul 4, 2018 6:09PM

 

ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్రం మీద పోరాడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఏపీకి ఇక ఇచ్చేదేమీ లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది.. ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి. కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.. ఈ అఫిడవిట్ లో ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలిపింది.. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. 

సాధ్యాఅసాధ్యాలపై అధ్యయనం అంటూ మెలిక పెట్టింది.. విశాఖ రైల్వే జోన్ ఊసే ఎత్తలేదు.. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు.. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు.. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూ లోటు కేవలం రూ. 4,116 కోట్లు మాత్రమేనని.. ఇప్పటి వరకు రూ. 3,979 కోట్లు ఇచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చామని.. యూసీలు సమర్పించిన తర్వాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల వంతున చెల్లిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.