మార్చి 9 తర్వాతే కేంద్ర బడ్జెట్:ప్రణబ్
Published on: Thu Jan 5, 2012 7:54AM
న్
యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను మార్చి 9 తర్వాతే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌ను సాధారణంగా ఫిబ్రవరి నెల చివరిరోజు ప్రవేశపెడతారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తేదీపై కసరత్తు చేస్తున్నామని, శాసనసభ ఎన్నికల తర్వాతే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మార్చి 9 వరకు కోడ్ అమల్లో ఉంటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఎన్నికలు జనవరి 30 నుంచి మార్చి 3 వరకు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 4న జరుగుతుంది. కోడ్ మార్చి 9తో ముగుస్తుంది. 10, 11 తేదీల్లో శని, ఆదివారాలు రావడంతో సెలవు దినాలు. మార్చి 12న సోమవారం బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్ని రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. జనవరి 13న పరిశ్రమల అధిపతులు, 16న కార్మిక సంఘాల నేతలు ప్రణబ్‌తో సమావేశమౌతారు.


