చంద్రబాబు రంపచోడవరం పర్యటనకు సెంట్రల్ కమాండర్ సెక్యూరిటీ.!
Published on: Fri Jul 24, 2026 6:26AM

రంపచోడవరంలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ శుక్రవారం (జులై 24) పర్యటించనున్నారు ఈ పర్యటనలో హై వోల్టేజ్ సెక్యూరిటీ ఉండనుంది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం కావడంతో.. ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఇంటెలిజెన్స్ సీఎం ప్రోగ్రాం కి కేంద్ర హోంశాఖ ను 100 మంది హై హెవీ కమాండర్ సెక్యూరిటీ కావాలని కోరింది. దీనిపై స్పందించిన కేందర హోంశాఖ 90 మందిని పంపింది.
మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బాబు పర్యటించే ప్రాంతంతో పాటు పరిసర అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రేహౌండ్స్, పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. డ్రోన్ సహాయంతో ఆకాశమార్గాన నిఘా ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి సీఎం చంద్రబబు పాల్గొనే సభా ప్రాంగణం వరకు మూడు అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు, అటవీ హక్కుల పట్టాలు, తాగునీరు, రహదారుల పనులపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే..గిరిజన ప్రాంతాలలో డిజిటల్ విద్యకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.
Central Command security, Chandrababu, Rampachodavaram tour


