TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మేయం.. ప్రైవేటీకరిస్తామంతే ! విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి 

Published on: Sat Feb 6, 2021 1:47PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం  ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర సర్కార్ పై నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో నిరసనలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై స్పందించారు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతీ పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని వెల్లడించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను మాత్రమే నీతీ ఆయోగ్ సూచనల మేరకు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టుపైనా స్పందించారు అనురాగ్ ఠాకూర్.  ఒప్పందం  ప్రకారం పోలవరం ప్రాజక్టుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ మధ్య కాలంలో ఏపీ ఆర్థికమంత్రి పోలవరం నిధులపై మూడు సార్లు కలిశారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు. బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని అనురాగ్ సింగ్ సూచించారు.