Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీకే కాదు.. తెలంగాణకూ అప్పుల తిప్పలే
posted on: May 1, 2022 11:01AM
ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేని పరిస్థితి తెలిసిందే. లెక్కల చిట్టాలు విప్పితే తప్ప కొత్త అప్పులకు నో అంటూ కేంద్రం ఏపీకి దాదాపుగా అప్పులకు మార్గం లేకుండా దారులు మూసేసింది. అయితే ధనిక రాష్ట్రం అయిన తెలంగాణకూ అప్పుల తిప్పలు తప్పడం లేదు.
రెండు రాష్ట్రాల అప్పుల తిప్పలకు కారణాలు వేరు వేరు అయినా ఫలితం మాత్రం ఇరు రాష్ట్రాలకూ ఒకేలా ఉంది. ధనిక రాష్ట్రమే అయినా, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయే చూపిస్తోంది. ఇక ఏపీ సంగతి తెలిసిందే. ఎందుకు అప్పు తీసుకుంటోందో అందుకు వ్యయం చేస్తుందన్న గ్యారంటీ లేదు. విపత్తు నిధులను సైతం సంక్షేమ పద్దుకు మరళించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఇన్వెస్ట్ చేసేసిన చరిత్ర ఏపీది. ఏపీకి రుణం అందక అవస్థలు పడటం ఆ రాష్ట్ర ప్రభుత్వ స్వయం కృతాపరాధమే. మరి తెలంగాణకూ అదే పరిస్థితి ఎందుకు? ఈ నిరాకరణ వెనుక రాజకీయం ఉందా?
మొదటి మూడు నెలల్లో ఆర్బీఐ నుంచి రూ. పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి పరిస్థితిుల్నిచక్క బెట్టుకుందామనుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. ఏప్రిల్ నెలలో రూ. ఐదు వేల కోట్ల అప్పు కోసం చేసిన ప్రయత్నాలకూ సేమ్ రిజల్ట్. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి.. తమ అప్పులు.. గ్యారంటీలు.. కార్పొరేషన్ల అప్పుల వివరాలన్నింటినీ కేంద్రానికి పంపించినా, ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్స్ దాటేసిందన్న నెపంతో కేంద్రం కొత్త రుణాలకు మోకాలడ్డింది. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ, తాము చేసే అప్పులు భవిష్యత్ అభివృద్ధికి పెట్టుబడే నంటూ చెబుతున్న తెలంగాణ రాష్ట్రం కూడా నిబంధనలకు నీళ్లొదిలేసి పరిమితిని మించి అప్పులు చేసేసిందనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ కూడా అభివృద్ధి కంటే ఎన్నికల ముంగిట ఉచిత పందేరాల పథకాలకే అగ్ర తాంబూలమిచ్చి..మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేస్తోందన్న విపక్షాల విమర్శలకు ఎఫ్ఆర్బీఎం లిమిట్ దాటేసి మరీ అప్పులు చేసిందన్న సమాచారం ఊతమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కేంద్రం నిర్వాకం కేవలం రాజకీయమేనని తెరాస ఎదురుదాడికి దిగినా గణాంకాల ఆధారంగా రాష్ట్ర పన్నుల వాటాలో కోత అనివార్యమని అర్దమౌతున్నది. తెలంగాణ పన్నుల రూపంలో రాష్ట్రానికి చెల్లించిన మొత్తం లెక్కలను చెబుతూ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు అప్పులకు అనుమతి చేసి తెలంగాణకు ఎందుకివ్వరన్న తెరాస విమర్శలు రాజకీయ ప్రయోజనాలకు పని కొస్తాయేమో కానీ, అప్పు పుట్టడానికి కాదు.ఇక ఏపీ అయితే ఏపీకి మాత్రం అలా తీసుకున్న అప్పులు, వాటిని వ్యయం చేసిన వివరాలు వెల్లడిస్తే.. అసలింక అప్పుపుట్టే పరిస్థితే ఉండదు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి ఏం చేస్తాయన్నది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది.


.webp)



