Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కమల్‌హాసన్ కి ఆమిర్‌ఖాన్ క్షమాపణ
posted on: Mar 27, 2015 10:31AM
సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిన తరువాత ఆచిత్రం విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. ముంబైలో జరిగిన 'ఫిక్కి-ఫ్రేమ్స్' కార్యక్రమంలో ఆమిర్‌ఖాన్, కమలహాసన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభం ఆమిర్‌ఖాన్, కమల్ హాసన్ చేతుల మీదిగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను నిషేధించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గురించి ప్రస్తావించారు. కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ నిషేధించిన సమయంలో పనులతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం గురించి పట్టించుకోలేకపోయానన్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లోనే అందరూ కలిసుండాలని, కానీ ఆపని చేయడానికి నేను ముందుకు రానందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఆయనకు సహాయం చేయలేకపోయినందుకు బహిరంగగా క్షమాపణ చెబుతున్నాని చెప్పారు.


.jpg)
.jpg)


