సోష‌ల్ మీడియా చివాట్లతో పైస‌లు తీస్తున్న‌సెలబ్రెటీలు!

ఇప్పుడిప్పుడే సాయం చేయడానికి జేబుల్లో చేయిపెడుతున్నారు సెలబ్రెటీలు. ఈ క్రమంలో హీరో నితిన్ 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించి ఆద‌ర్శంగా నిలిచారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం రెండు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు ప్రకటించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. మహేష్ బాబు కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రామ్‌చ‌ర‌ణ్ రూ.70 లక్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు.

సినిమా ఇండస్ట్రీలో పెద్ద‌బాబు, చిన్న‌బాబు, ఎవ్వరూ కరోనాకు సాయం అందించే విషయంలో ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. ఎంత సేపూ ట్వీట్ లు వేయడం, విడియోలు వేయడం తప్పించి, రూపాయి విదిల్చిన పాపాన పోలేదు.

టాప్ హీరోలు సోషల్ మీడియాలో చేసే ప్రవచనాలు, విడియోలు తిరస్కరించాలని, కానీ ఖర్చులేకుండా వాళ్లు చెప్పే సొల్లు కబుర్లు, వాటిని ప్రచారం చేయడం వంటి వాటి పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ఎక్కువైయ్యాయి.

ప్రజాభిమానాన్ని కోట్లకు కోట్లు కింద క్యాష్ చేసుకుంటూ, అవసరం అయినపుడు రూపాయి విదల్చని వారికి కనువిప్పు కలిగే అవకాశం వుందని సోష‌ల్ మీడియాలో కామెంట్ లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి.

చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. అక్కినేని ఫ్యామిలీ కావ‌చ్చు అందరూ అదేబాపతు. చేతులు కడుక్కోండి..మూతులు కడుక్కోండి..ఇంట్లో వుండండి అంటూ విడియోల మీద విడియోలు ట్విట్టర్ లో పడేయడం. దాన్ని ఆ హీరోల పీర్వోలు వాట్సాప్ ల్లో డంప్ చేయడం. ఇదే కార్యక్రమమా అంటూ జ‌నం నిల‌దీస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

వినాయక్, శివాజీరాజా లాంటి వాళ్లు కనీసం వాళ్ల వాళ్ల స్థాయిల్లో ఏదో ప్రయత్నం చేసారు. వీరందరికన్నా రాజశేఖర్ మందుకు వచ్చారు. నేను ట్విట్టర్ లో, ఇన్ స్టాలోకి వచ్చానోచ్ అంటూ తెగ హడావుడి చేసిన మెగాస్టార్ చేసింది లేదు, ప్రకటించిందీ లేదు. అసలు కరోనా మీద ఇప్పటి వరకు ఓ స్టేట్ మెంట్ కానీ, విడియో కానీ, విన్నపం కానీ ఏదీ చేయని హీరో ఎవరు అంటే బాలయ్యే అంటున్నారు నెట్‌జ‌నులంతా.

పేదలు, చిన్నవ్యాపారులు, స్వయం ఉపాధి కళాకారులకు, చేతివృత్తిదారులు కరోనా బారిన పడితే వారి వైద్య అవసరాల కోసం తమ ఫౌండేషన్‌ మెడికల్ ఫండ్‌గా రూ 1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితా డోంగ్రే తెలిపారు.