TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరికృష్ణ మృతికి సోషల్ మీడియాలో ప్రముఖుల సంతాపం

Published on: Wed Aug 29, 2018 12:42PM

నందమూరి హరికృష్ణ ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. ఆయన మరణవార్త విని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

 

 

‘నందమూరి హరికృష్ణగారి మృతి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి నిజంగా తీరనిలోటు’ - నారా లోకేష్‌

‘నందమూరి హరికృష్ణ చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’-  వైఎస్‌ జగన్‌

హరికృష్ణ మరణ వార్త  విచారం కలిగిస్తోంది.. సోదరుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తోపాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను - కేటీఆర్

చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు.. ఇది కొన్ని వారాల క్రితం ఆయన చెప్పిన మాట.. కానీ ఇప్పుడు ఆయన లేరు.. నీతో పాటు నీ గర్జనను కోల్పోతున్నందుకు ఎంతగానో బాధగా ఉంది అన్నయ్య - నాగార్జున

‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త ఎంతో విచారం కలిగిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా ప్రియమైన సోదరుడు తారక్‌, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’- మహేష్‌బాబు

ఈ రోజు నా సోదరుడు హరికృష్ణను కోల్పోయాను.. ఏం చెప్పాలో నాకు మాటలు రావడంలేదు - మోహన్‌బాబు

‘హరికృష్ణగారు చనిపోయారన్న వార్త నమ్మలేకపోతున్నా. గుండె పగిలిపోతోంది. నాకు, నా తండ్రికి ఎంతో ఆప్తులు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లకు ఆ దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలి’- దేవిశ్రీ ప్రసాద్‌

‘హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని షాకయ్యా! వ్యక్తిగతంగా ఆయన్ను ఎప్పుడూ కలవలేదు. కానీ, ఎంతో కాలం నుంచి తెలిసిన వ్యక్తిలా అనిపించేవారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ -నాని

‘ఎంతో హృదయ విదారక వార్తను విన్నా. హరికృష్ణగారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఆయనొక డైనమిక్‌, నిజయాతీ కలిగిన వ్యక్తి. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ -శ్రీను వైట్ల

‘నిజంగా షాక్‌. హరికృష్ణగారు మృతి చెందడంతో ఎంతో విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’- అనిల్‌ రావిపూడి

‘నమ్మలేకపోతున్నా. ఆయన కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి’ -మంచు విష్ణు

‘దేవుడు కఠినాత్ముడు. మాటలు రావడం లేదు. హరికృష్ణ అంకుల్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించాలి’ - మంచు మనోజ్‌

‘నిద్ర లేవగానే ఇలాంటి భయంకరమైన వార్త వింటానని అనుకోలేదు. హరికృష్ణగారి మరణ వార్త విని విచారంతో నా హృదయం బరువెక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. తారక్‌, కల్యాణ్‌లకే కాదు, మొత్తం కుటుంబానికే ఆయన మరణం పెద్ద లోటు’ -సుధీర్‌బాబు

‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది’ - వరుణ్‌తేజ్‌

‘నందమూరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ -సాయిధరమ్‌తేజ్‌

‘తారక్‌, కల్యాణ్‌రామ్‌ సర్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వారికిది చాలా కఠిన సమయం. హరికృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ - వెన్నెల కిషోర్‌