TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆమె పాక్ ను తుడిచిపెట్టేయమని మోదీని కోరుతోంది...

Published on: Sat Oct 29, 2016 4:41PM

 

పాకిస్తాన్ తో యుద్ధం మొదలైపోయిందా? మనం కాలేదని అనుకుంటున్నాం కాని బార్డర్ లో యుద్ధం నడుస్తూనే వుంది. ఇటు మనవాళ్లు, అటు వాళ్ల సైనికులు రోజూ మరణిస్తూనే వున్నారు. ఇంత కాలం ఇలా జరగకూడదని భారత్ పట్టిన ఓపికని పాక్ దుర్వినియోగం చేసింది. పదే పదే రెచ్చిగొట్టి ఇప్పుడు విలయం తెచ్చి పెట్టుకుంది.

 

మోదీజీ! అసలు పాక్ అనేది లేకుండా చేసేయండి... ఈ మాట అన్నది ఎవరో ఆవేశపరుడైన కాలేజ్ యువకుడు కాదు. పాక్ బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాను భార్య. హర్యాణాలోని కురుక్షేత్రాకు చెందిన మన్ దీప్ సింగ్ యుద్ధంలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన అంత్యక్రియల తరువాత భార్య ఇలా నేరుగా మోదీని ఉద్దేశించి ఓ మాట చెప్పింది. పాకిస్తాన్ కు మంచిగా చెప్పి చూడండి. వినకపోతే అసలు పాక్ అనేది లేనే లేకుండా తుడిచిపెట్టేయండి. అంతే కాని, ఇలా ప్రతీ రోజూ చీకటి దీపావళి జరుపుకునేలా చేయకండి... అందామె! ఈ మాటల్లో ఆమె విషాదం, బాధ అర్థం చేసుకోవచ్చు...

 

ఒక్క మన్ దీప్ సింగే కాదు పాక్ కాల్పుల్లో ఈ మధ్య మన వాళ్లు చాలా మందే మరణించారు. అంతకంటే ఎక్కువ మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమైతున్నప్పటికీ అమరులైన జవాన్ల కుటుంబాల నష్టం, కష్టం మాత్రం దేనితోనూ తగ్గేది కాదు. అయినా వాళ్లంతా ప్రాణత్యాగం చేసిన తమ వారి చితి మంటల సాక్షిగా పాక్ అంతం కోరుతున్నారు. మరో వైపు పాక్ మాత్రం తన సైన్యం ఎంత మరణించినా ఎవ్వరూ చావలేదని బుకాయిస్తోంది. రక్తపు క్రీడ రెచ్చగొట్టికొనసాగిస్తోంది. ఇక ఇంచుమించూ ఒకే ఒక్క మార్గం మిగిలేలా పరిస్థితులు తీసుకొస్తోంది! 

 

పాక్ యుద్ద పిపాస, ఉన్మాదం చివరకు దాని అంతానికి ఆరంభం అయ్యేలా వున్నాయి. చిలికి చిలికి గాలివానలా యుద్ధంగాని పూర్తి స్థాయిలో రాజుకుంటే... బలూచిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ పాక్ చేతిలోంచి జారిపోవటానికి వారం సమయం కూడా పట్టదు. మోదీ యుద్ధంతోనో, యుద్ధం లేకుండానో పాకిస్తాన్ ను ముక్కలు చేసే వ్యూహం అమలు చేయాలి. అదే మనకి, ప్రపంచానికి, ఆఖరుకి పాక్ లోని ఉన్మాదం లేని అమాయకులకి ... మంచిది! అప్పడే ప్రాణత్యాగాలు చేసిన జవాన్ల కుటుంబాలకి న్యాయం జరిగినట్టు...