జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి.. తెలుగు ప్రజలకు చంద్రబాబు భోగి శుభాకాంక్షలు
Published on: Wed Jan 14, 2026 7:19AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామం నారావారిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్న ఆయన ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి రంగవల్లులతో అలరారుతున్న తెలుగు వారి ఇళ్లల్లో కొత్త వెలుగులు తేవాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.


