TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయాలలో చంద్రబాబు అన్ స్టాపబుల్!

Published on: Tue Oct 22, 2024 11:05AM

నందమూరి బాలకృష్ణ, నటసింహం. సినిమాలలో ఆయన అన్ స్టాపబుల్.. అలాగే రాజకీయాలలో  అన్ స్టాపబుల్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని స్వయంగా చంద్రబాబే చెబితే.. ఔను తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారు. 

హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ నాలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ కు కూడా చంద్రబాబు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు సీజన్ 4కు ఆయన   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీజన్ 4కు సంబందించి ప్రోమో విడుదలైంది. తొలి ఎపిసోడ్ ఈ నెల 25న ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.  

కాగా తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం బాలయ్యతో అన్ స్టాపబుల్ టాక్ షోలో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి ఆయన మాట్లాడారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కక్ష రాజకీయాలు నడిచాయి. తన హయాంలో అటువంటి వాటికి తావు ఉండదని చంద్రబాబు విస్ఫష్టంగా చెప్పారు. అదే సమయంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రశక్తేలేదని అన్నారు. సీజన్ 2లో చంద్రబాబు పాల్గొన్న ఎపిసోడ్ లో నారా లోకేష్ వచ్చారు. ఈ సారి ఎవరు వస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరైతే ఈ ఎపిసోడ్ లో  చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సర్ ప్రైజ్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.