TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం చంద్రబాబు ట్వీట్‌.. పవర్ స్టార్ హర్షం

Published on: Thu Jul 24, 2025 1:25PM

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా సూపర్ సక్సెస్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు   ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.  మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు గురువారం (జులై 24)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం (జులై 23)   రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు (#HariHaraVeeraMallu) చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు... చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన 'హరిహర వీరమల్లు' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే...  సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం ఆ పోస్టులో పేర్కొన్నారు.  

ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ.. 'సీఎం చంద్రబాబు గారూ, నేను గత పదేళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు  హరిహర వీరమల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను  అని  పేర్కొన్నారు.