TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలోనూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. విధి విధానాల ఖరారు!

Published on: Mon Aug 12, 2024 10:40AM

తెలుగుదేశం ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు శ్రీకారం చుట్టింది.

ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (ఆగస్టు 12) ఖరారు చేయనున్నారు. ఇందు కోసం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. 
హైదరాబాద్ నుంచి అమరావతికి ఈ ఉదయం చేరుకున్న చంద్రబాబు నేరుగా సచివాలయానికి చేరుకున్నారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై అధికారులతో చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తారు. దీనితో పాటు పలు అంశాలపై కూడా అధికారులతో సీఎం సమీక్షిస్తారు.