TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగులు, పెన్షనర్లకు బాబు సర్కార్ సంక్రాంతి గిఫ్ట్

Published on: Tue Jan 13, 2026 12:13PM

పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ బహుమతి ప్రకటించింది. దీర్ఘ కాలంగా ఉన్న బకాయిలను చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి పడిన 2, 653 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధుల విడుదల కు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఈ ఉత్తర్వులతో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు   మౌలిక సదుపాయాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు  కూడా ఉపశమనం లభిస్తుంది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులు , పెన్షనర్లకు   లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.