TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఎందుకంటే?

Published on: Fri Nov 15, 2024 8:52AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (నవంబర్ 15) ఢిల్లీకి వెడుతున్నారు. అక్కడ ఒక ప్రముఖ పత్రిక  శనివారం నిర్వహించే లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరౌతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెడతారు.  ఈ పర్యటనలో ఆయన   కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అవుతారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర కు చేరుకుని  అక్కడ ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి  సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురూ  మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.