TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Published on: Wed Aug 14, 2024 4:39PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16న హస్తినకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన హస్తినకు వెళ్లడం ఇది మూడో సారి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు.

పోలవరం, అమరావతి తదితర అంశాలపై ప్రధాని మోడీతో చర్చించడమే ఈ పర్యటన ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. చంద్రబాబు ఈ నెల 17న మోడీతో భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి దక్కాల్సిన ఇతర ప్రయోజనాలపై కూడా ఆయన మోడీ వద్ద ప్రస్తావించనున్నారు.

 తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఈ రెండు నెలలలో చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఇది మూడో సారి అవుతుంది. దీనిని బట్టే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్ధమౌతుంది.