TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిప్యూటీ స్పీకర్ పై దాడిని ఖండించిన చంద్రబాబు

Published on: Sat Mar 28, 2026 9:41AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్ల స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై ఆకివీడులో శుక్రవారం (మార్చి 27) జరిగిన దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.  ఉండి నియోవర్గం ఆకివీడులో శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఉన్న పురాతన ఆలయంలో   పూజకు వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు, కూటమి నాయకులపై కొందరు దాడి చేయడాన్ని  ఖండించిన చంద్రబాబు దశాబ్దాలుగా నిరాదరణకు గురైన రామాలయ పునరుద్ధరణకు డిప్యూటీ స్పీకర్ చర్యలు చేపట్టారనీ, ఆ క్రమంలోనే ఆ ఆలయంలో  పూజలకు వెళ్లిన సమయంలో.. బయటి వ్యక్తులతో కలిసి కొంతమంది  దాడికి తెగబడటం గర్హనీయమన్నారు.

భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాల్సిన పవిత్ర సమయంలో ఇటువంటి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. ఈ దాడిలో కొందరు గాయపడి ఆసుపత్రి పాలవ్వడం దురదృష్టకమన్నారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యహరించినా చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.