సతీమణి భువనేశ్వరికి చంద్రబాబు బర్త్ డే విషెస్
Published on: Fri Jun 20, 2025 9:38AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. నా జీవితానికి వెలుగు భువనేశ్వరి, మాకుటుంబానికి ఆధారం అంటూ చంద్రబాబు తన జీవిత భాగస్వామిగా ఉన్నందుకు భువనేశ్వరికి కృతజ్ణతలు తెలిపారు.


