TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రావాల్సిందే .. సీబీఐ.. కుదరదు.. అవినాష్

Published on: Tue May 16, 2023 2:41PM

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ  హుకుం జారీ చేసింది.  

ఆయన హాజరు కావడానికి అడిగిన నాలుగు రోజుల గడువుకు సీబీఐ నో చెప్పింది. తక్షణమే హాజరై తీరాలని సీబీఐ నిర్దేశించింది.

అయితే సీబీఐకి నాలుగు రోజులు గడువు కావాలని లేఖ రాసిన అవినాష్ రెడ్డి, సీబీఐ స్పందన కోసం వేచి చూడకుండానే పార్టీ కార్యక్రమాల సాకుతో పులివెందులకు బయలుదేరి వెళ్లి పోయారు.

మరి ఇప్పుడు అవినాష్ ధిక్కరణపై సీబీఐ ఏం చర్య తీసుకుంటుందో  అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.