సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్
Published on: Sat Aug 2, 2014 1:59PM

సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కొన్ని కంపెనీలు తీసుకున్న రుణాల కాలపరిమితిని పెంచడం కోసం ఎస్.కె.జైన్ కొన్ని కంపెనీల నుంచి 50 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో సీబీఐ ఆయన్ని శనివారం నాడు అరెస్టు చేసింది. ఎస్.కె.జైన్‌ని అరెస్టు చేయడంతోపాటు ఆయనకు సంబంధించిన మరో ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. ఎస్.కె.జైన్‌కి సంబంధించిన 20 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపి జైన్ లంచంగా తీసుకున్న 50 లక్షల రూపాయలతోపాటు కొన్ని కీలక పత్రాలను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


