TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సర్కారు వేలాది ఆలయాలను కబ్జా చేసింది!  మాజీ ఐపీఎస్ సంచలనం

Published on: Wed Jan 6, 2021 11:49AM

ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు కలకలం రేపుతుండగానే వైసీపీ ప్రభుత్వంపై  మాజీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ ఏపీలో  వేలాది ఆలయాలను కబ్జా చేసిందని మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మన్నెం నాగేశ్వరరావు ఆరోపించారు.  చర్చ్‌లు, మసీదులను వదిలేసి.. ఏపీ సర్కారు 24,846 ఆలయాలను కబ్జా చేయడం ఎంత వరకు సెక్యులర్ అని ఆయన ప్రశ్నించారు. అనవసర రాద్ధాంతం వద్దని జగన్ భావిస్తే.. ఆలయాలను హిందూ సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిక్ గురుద్వారా చట్టం తరహాలో చట్టం చేస్తారా? అని ప్రశ్నించారు. మీరు ఆసక్తి చూపితే దాని గురించి నేను ప్రజెంటేషన్ ఇస్తానని మన్నెం నాగేశ్వరరావు ట్వీట్ చేశారు.

ఏపీలో హిందూ దేవాలయాలను కబ్జా చేశారంటూ సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ చేసిన ఆరోపణలు పెను దమారం రేపుతున్నాయి. హిందూ టెంపుల్స్ పై దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదనే  ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయని హిందూ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. ఆ వివాదం జరుగుతుండగానే.. మన్నె నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు ఏపీలో ప్రకంపనలు స్పష్టించే అవకాశం ఉంది.