TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ అనుమతుల గోలేంటో!

Published on: Sat Nov 23, 2013 5:43PM

 

 

 

స్కాముల్లో పీకల్లోతులో మునిగిపోయిన జగన్ బాబు శేష జీవితం అటు జైల్లోగానీ, లేదా ప్రతిదానికీ పర్మిషన్లు తీసుకుంటూ ఉంటూ గానీ గడిచిపోయేలా వుంది. తిట్టే నోరు, తిరిగేకాలు ఊరుకోవంటారు. రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబును తిట్టిన జగన్‌ ఆ రెండిటికీ అలవాటు పడిపోయాడు. అందుకే తిట్టకుండా, తిరగకుండా ఒక్క రోజు కూడా వుండలేని పరిస్థితికి చేరుకున్నాడు.

 

సీబీఐ కోర్టేమో నీలాంటోడు దేశమంతా తిరిగితే డేంజర్ అని  జగన్ని హైదరాబాద్‌ దాటకూడదని చెప్పింది. జగన్ మాత్రం ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి దేశమంతా తిరగడానికి పర్మిషన్లు తీసుకుని తన టూర్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. జాతీయ నాయకుల అందరి దగ్గరకి వెళ్ళి తనకు ఇష్టం లేనివాళ్ళని, తన అవినీతిని ప్రశ్నించినవాళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. మొదట ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్ళడానికైనా అనుమతి ఇవ్వండి మహాప్రభో అని బతిమలాడుకున్న జగన్ ఆ అనుమతి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడానికి పర్మిషన్ కోసం తంటాలు పడ్డాడు.




పోనిలే కదా అని ఢిల్లీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే కోల్‌కతా వెళ్ళడానికి అనుమతి కావాలన్నాడు. సర్లే అని దానికీ అనుమతిస్తే ఇప్పుడు మరికొన్న ఊళ్ళ పేర్లు చెప్పి దానికీ పర్మిషన్ తీసుకున్నాడు. దేశదిమ్మరిలా దేశమంతా తిరుగుతానంటే చట్టాలు ఒప్పకోవడం లేదని ఇలా ముక్కలు ముక్కలుగా పర్మిషన్ తీసుకుంటున్న జగన్, ఈ పర్యటనలు చేస్తోంది రాష్ట్రానికి ముక్కలు చేయడానికేనన్న విమర్శలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకూ చేసిన పర్యటనల కారణంగా తాను సాధించిందేమీ లేకపోయినా మడమ తిప్పకుండా జగన్ బాబు జైత్రయాత్రలు కొనసాగిస్తున్నాడు.