ఇదే లాస్ట్ ఛాన్స్.. ఇక జగన్ బెయిల్ రద్దేనా?
Published on: Wed May 26, 2021 12:19PM
ప్రతీ శుక్రవారం కోర్టుకెళ్లే ముఖ్యమంత్రిగా అప్పట్లో జగన్‌రెడ్డి ఫుల్ పాపులర్ అయ్యారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకోవడంతో.. హమ్మయ్యా అంటూ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. అయితే, ఆ సౌలభ్యం ఎన్నో రోజులు ఉండేలా లేదు. ఎంపీ రఘురామ రూపంలో జగన్‌రెడ్డి బెయిల్‌కి ఎసరు పడే అవకాశం పక్కాగా కనిపిస్తోంది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై వేగంగా విచారణ జరుగుతోంది. అయితే, జగన్ తరఫు లాయర్లు ఎప్పటికప్పుడు వాయిదాలు కోరుతూ.. విచారణను సాధ్యమైనంత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా.. కౌంటర్ దాఖలుకు వరుసగా గడువు కోరుతుండటంపై సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి ఆవకాశమంటూ తేల్చి చెప్పేసింది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణన చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. అనంతరం సీఎం జగన్‌రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.
జగన్ బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపగా.. సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని.. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.


