సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ, ఈడీ సోదాలు
Published on: Sat Jun 1, 2019 6:02PM

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని సీబీఐ, ఈడీలు సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో ఇప్పటికి ఐదారు సార్లు సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసారు. తాజాగా మరోసారి చేస్తున్నారు. బెంగుళూరు, చెన్నై నుంచి వచ్చిన సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుజనా చౌదరికి చెందిన ఓ కంపెనీ చెన్నైలోని ఒక జాతీయ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనితో పాటు సీబీఐ ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసును కూడా నమోదు చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆయన బెంగుళూరులో సీబీఐ విచారణకు హాజరయ్యారు. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పలు డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసినట్టు సమాచారం.


