జగన్ కేసులో ఆఖరి చార్జ్ షీట్లు నేడే

 

వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ ఈ రోజు ఆఖరి చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో దాఖలుచేయబోతోంది. ఇదే విషయం కోర్టుకి ముందే తెలియజేసి అందుకు కోర్టు అనుమతి కూడా పొందింది. రేపు కోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణకు స్వీకరించబోతున్నందున, సీబీఐ ఈ రోజే దానిపై కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.

 

నేటితో సీబీఐ తుది చార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం పూర్తవుతుంది గనుక, సీబీఐ ఈసారయినా జగన్మోహన్ రెడ్డి బెయిలుకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అంగీకరిస్తుందా లేక మళ్ళీ అడ్డుపడుతుందా అనేది సంగతి రేపు కోర్టులో విచారణ మొదలయినప్పుడు తేలిపోవచ్చును. కానీ తెదేపా, వైకాపాలు జగన్ బెయిలు విషయంలో ఒకరిపై మరొకరు చేసుకొంటున్నఆరోపణలను గమనిస్తే, అతని బెయిలు సంగతి సీబీఐ కోర్టులో కాక డిల్లీలో నిర్ణయించబడుతుందనే అపోహ ప్రజలలో కలుగుతోంది.