TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయమ్మ లేఖకు జగన్ వత్తాసు

Published on: Wed Feb 1, 2012 8:56AM

హైదరాబాద్: సిబిఐ దర్యాప్తు తీరును తప్పు పడుతూ తన తల్లి వైయస్ విజయమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమర్థించుకున్నారు.ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ  తాను ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్య రేపు మీకూ ఎదురు కావచ్చు అని  మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ఎదుర్కుంటున్న పరిస్థితి ఎవరికైనా ఎదురు కావచ్చునని, అటువంటి తీరుపై గొంతు విప్పాల్సి ఉంటుందని, నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పరిస్థితిని ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. విజయమ్మ రాసిన లేఖకు తగిన ఫలితం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని పరిస్థితిని వైయస్ విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో వివరించారని ఆయన చెప్పారు. లేఖలను చదివిన తర్వాత ప్రధాని ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రాశారని ఆయన అన్నారు. తన లేఖలో విజయమ్మ వాస్తవాలను వివరించారని ఆయన చెప్పారు.