విజయమ్మ లేఖకు అర్ధం లేదన్న జేసి
Published on: Tue Jan 31, 2012 3:40PM
హైద
రాబాద్: సీబీఐ వ్యవహారంలో వైఎస్ విజయమ్మ ప్రధానికి లేఖ రాయడాన్ని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. సీబీఐ జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడంలో అర్థంలేదన్నారు. చంద్రబాబు హయాంలో ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో అమ్మకాలు , కొనుగోలు జరగలేదన్న జేసీ బాబు తప్పు చేశాడని తేలితే ఆయనను కూడా విచారించాలన్నారు. తనపై ఆరోపణలు వచ్చినా విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమని స్పష్టం చేశారు. ఆనాటి కేబినెట్ మంత్రులపై తప్పు తేలితే వారు కూడా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు.


