విజయమ్మ వ్యాఖ్యలను తప్పుపట్టిన శైలజానాథ్
Published on: Tue Jan 31, 2012 2:22PM
అనం
త : సీబీఐ విచారణ జగన్ లక్ష్యంగా జరుగుతోందన్న వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలను ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాధ్ తప్పుబట్టారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్లో ఒక్కటి కూడా నిజం లేదని అయన వ్యాఖ్యానించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రమేయం లేదని ఇదే సీబీఐ తేల్చిందని ఆయన గుర్తుచేశారు. విచారణ వారికి అనుకూలంగా లేదని ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందన్నారు. సీబీఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా పని చేస్తుంటే కాంగ్రెస్‌కు చెందిన నేతలు ఎందుకు జైలుకు వెళుతారని ఆయన ప్రశ్నిచారు. జూడాల సమస్యలనుపరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని శైలజానాథ్ చెప్పారు.


