సిబిఐ అడిగిన వివరాలు అందించా:అంబటి
Published on: Sun Jan 8, 2012 1:08PM
హైదరా
బాద్: కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆచరించిన వ్యూహాన్నే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాటించారు. ఎమ్మార్ కేసు వ్యవహారంలో తప్పంతా టిడిపి అధినేత నారా చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన చెప్పారు. ఎమ్మార్ కేసులో సిబిఐ అధికారులు ఆదివారం అంబటి రాంబాబును విచారించారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం - ఎమ్మార్ అగ్రిమెంట్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పారు. తనను సాక్షిగానే విచారించారని, జగన్ ఆస్తుల కేసులో తనను ప్రశ్నించలేదని చెప్పారు. సిబిఐ అడిగిన వివరాలు అందించానని, మళ్లీ ఎప్పుడు హాజరు కమ్మంటే అప్పుడు హాజరయ్యేందుకు సిద్ధమన్నారు. ఎపిఐఐసితో సంబంధం లేకుండా ఎమ్మార్, ఎంఎఫ్‌జి ఒప్పందం జరిగిందన్నారు. నా హయాంలో జరిగిన పూర్తి వివరాలు సిబిఐకి అందించానన్నారు.


